బాన్సువాడ, బతుకమ్మ : బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులో తెలంగాణ తిరుమల దేవస్థానం లో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయం మండపంలో నిర్వహించే కార్యక్రమాల్లో పూజ, యజ్ఞంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి , పుష్ప దంపతులు పాల్గొన్నారు.గురువారం గణపతి పూజ, ప్రత్యేక యజ్ఞ కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోచారం కుటుంబ సభ్యులు , పోచారం సోదరుడు శంభురెడ్డి,ప్రేమల , కుమారుడు పోచారం సురేందర్ రెడ్డి గ్రామస్తులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు.