22 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు
బోధన్, బతుకమ్మ: మహాశివరాత్రిని పురస్కరించుకుని బోధన్ లోని ఏకచక్రేశ్వరాలయంలో ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, ఆలయ కార్యనిర్వహణ అధికారి రాములు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కరపత్రాలు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రతి రోజూ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ శరత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంకు దామోదర్ రెడ్డి, వీడీసీ చైర్మన్...