Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2025, 1:22 pm Posted by : ramakrishna

22 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు

బోధన్, బతుకమ్మ: మహాశివరాత్రిని పురస్కరించుకుని బోధన్ లోని ఏకచక్రేశ్వరాలయంలో ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, ఆలయ కార్యనిర్వహణ అధికారి రాములు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కరపత్రాలు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రతి రోజూ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు  నిర్వహిస్తామని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో  మున్సిపల్ మాజీ చైర్మన్ శరత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంకు దామోదర్ రెడ్డి, వీడీసీ చైర్మన్ గంగాధర్ రావు పట్వారి, కోశాధికారి శ్రీనివాస్, మాజీ కౌన్సిల్ సభ్యులు పిట్ల సత్యం, ఆలయ పాలకమండలి సభ్యులు కమల భూమేశ్, సింగం లక్ష్మణ్, కవితాసంజీవ్, ప్రధాన అర్చకులు గణేశ్ మహరాజ్, ప్రముఖులు గంగాధరప్ప, ఎంబెల్లి గంగారాం, ఆలయ అధికారులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.