Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 7:44 pm Posted by : ramakrishna

బ్రాహ్మణపల్లి సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

. . . కండువా కప్పి ఆహ్వనించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

. . . అనంతరం చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే  భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

జక్రానపల్లి మండలం బ్రాహ్మణపల్లి సర్పంచ్ శివప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గుపనపల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో శివప్రసాద్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. తాజాగా జరిగిన గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందిన శివప్రసాద్‌తో పాటు వారి యూత్ సభ్యులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నమ్మకాన్ని కలిగించాయని కాంగ్రెస్‌లో చేరడానికి కారణమని వారు తెలిపారు. అనంతరం డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన  కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మునిపల్లి సర్పంచ్ సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్,    కాంగ్రెస్ నాయకులు టీ.సాగర్, పవన్, నికిల్ తదితరులు పాల్గొన్నారు.

 

Brahmanpalli Sarpanch joins Congress
Brahmanpalli Sarpanch joins Congress