Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2024, 2:51 pm Posted by : ramakrishna

పీ ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షునికి రాఖీ కట్టిన బ్రహ్మకుమారి

బతుకమ్మ నిజామాబాద్ : ఈనెల 19 నా రాఖీ పండుగను పురస్కరించుకొని బ్రహ్మకుమారీలు తెలంగాణ జిల్లా అధ్యక్షుడు ఉప్పల్ సింగ్ తో పాటు పాఠశాల సిబ్బందికి రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ  బండారం మందిర్ పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భూపాల్ సింగ్ మాట్లాడుతూ సమాజంలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల బంధానికి ప్రతిరూపం రక్షాబంధనని అన్నారు. సోదర భావం, మానవతా నైతిక విలువలను కాపాడాలని, అందుకు ఇది ఒకటే మార్గం అని అన్నారు. రాఖీ పండుగ ఆత్మీయ బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ఈశ్వరియ ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, జోష్న, వింధ్య, సావిత్రి, సుచిత్ర పాల్గొన్నారు.

Brahmakumari who tied rakhi to PRTU Telangana district president