వాల్టాకు తూట్లు
కల్దుర్కిలో వ్యవసాయ బోర్ల వద్ద తవ్వకాలు ధ్వంసమౌతున్న పైపులైన్లు అన్నదాతల ఆక్రందణలు పట్టించుకునేదెవరు బోధన్, బతుకమ్మ : మంజిరా నది గర్భంలో ఇసుక రీచ్ లకు ఇవ్వక ఇవ్వక అనుమతులు ఇవ్వడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అనుమతులతో ఇటీవల నిజామాబాద్ జిల్లాలో మంజిరాలో కల్దుర్కి, సిద్దాపూర్ లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చిన చోట తవ్వకాలకు రెవెన్యూ అధికారులు వే బిల్లులు మంజూరు చేస్తున్నారు. వే బిల్లులు ఉన్నవాటిని పోలీసు అధికారులు అనుమతిస్తున్నారు. కానీ...