Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2025, 8:56 pm Posted by : ramakrishna

మూడు గంటల్లో బాలుడి కిడ్నాప్ కేసు చేదన

 

. . . జంటను అరెస్టు చేసిన పోలీసులు

కామారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిక్షాటన కేస్తున్న దంపతుల కుమారుడి కిడ్నాప్ కేసును పోలీసులు మూడు గంటల్లోనే  చేదించారు. కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన మక్కల నర్సింలు అనే వ్యక్తి కామారెడ్డిలో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి తన భార్యపిల్లలతో సిరిసిల్లా రోడ్డులోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద నిద్రించాడు. అర్ధరాత్రి వేచి చూసే సరికి తన కొడుకు హర్షిత్ కనిపించకపోవడంతో కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి పోలీసులు సీసీ టీవీ పుటేజిలను పరిశీలించగా జంట బాలుడిని ఎత్తుకెళ్తున్న పుటేజి లభ్యమైంది. పోలీసులు పలు టీంలను ఏర్పాటు చేసి గాలించగా కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద బాలుడి చేత బిక్షాటన చేయిస్తూ దోమకొండ మండల  కేంద్రానికి  చెందిన పల్లపు రాజు, పల్లపు శారద దంపతులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి బాలుడిని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇరువురిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. మూడు గంటల్లో బాలుడి కిడ్నాప్ కేసును చేదించిన కామారెడ్డి పట్టణ పోలీసు అధికారులను అదనపు ఎస్పీ అభినందించారు.