Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 8:54 pm Posted by : ramakrishna

విద్యుత్ షాక్ కు గురై బాలుడికి తీవ్ర గాయాలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

 

గాలిపటం ఎగురవేస్తుండగా ఓ బాలుడికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని లోలం గ్రామంలో చోటు చేసుకుంది. బాలుడు హేమంత్ గాలిపటం ఎగరవేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.