విద్యుదాఘాతంతో బాలుడి మృతి
మాక్లూర్, బతుకమ్మ : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలంలోని మామిడి పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన చింత ప్రవీణ్ రెడ్డికి ఇద్దరు కుమారులు. తన చిన్న కుమారుడు చింత అభినయ్(15) పదో తరగతి చదువుతున్నాడు. చింత అభినయ్ హాస్టల్ నుంచి దసరా సెలవులకు తన స్వంత ఊరికి వచ్చాడు. శనివారం తన తండ్రితో కలిసి పొలంలో నీరు పెట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో మోటార్ స్టార్టర్ వద్ద కరెంట్ ఆపే ప్రయత్నంలో...