గాలిపటం కోసం వెళ్లి విద్యుత్ షాక్ బాలుడు మృతి

. ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో ఘటన ఎడపల్లి, బతుకమ్మ: చెట్టుకు వేలాడుతున్న గాలిపటాన్ని తీసేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మతీన్(13) గాలిపటం కోసం చెట్టుపైకి ఎక్కి తీస్తుండగా ప్రమాదవశాత్తు హై ఓల్టేజీ విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మతీన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. తన కుమారుడు తనను ఒంటరిని చేసి వెళ్లిపోయాడని...