Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2025, 9:02 pm Posted by : ramakrishna

స్కూల్ బస్సు కింద పడి బాలుని మృతి

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని రహత్ నగర్ పాత తాండకు చెందిన మూడు సంవత్సరాల బాలుడు స్కూల్ బస్సు కిందపడి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకొంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాత తాండ నుండి రోజు వారిగా స్కూల్ కు పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వెళ్లిన భీమ్ గల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన బస్సు పిల్లల్ని ఎక్కించుకొని వస్తు ముందు నడుస్తుండగా తెలియకుండా బస్సు దగ్గరకు వచ్చి నిలబడ్డ శ్రీకాంత్(3) బాలున్ని డ్రైవర్ చూడక ముందుకు బస్సు నడిపాడు. దాంతో బస్సు కింద పడ్డ బాలుడు ఆపస్మారక స్థితికి వెళ్ళగా హుటా హుటిన హాస్పిటల్ కు తరలించారు. బాలుడు హాస్పిటల్ చేరుకొనే లోపే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.భాదిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.