Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2024, 8:06 pm Posted by : ramakrishna

ఆటో బోల్తాపడి బాలుని మృతి

  • డ్రైవర్ అజాగ్రత్త ప్రాణం తీసింది

బతుకమ్మ, భీంగల్ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచలరని 9 సంవత్సరాల బాలుని ప్రాణం తీసింది. భీంగల్ ఎస్సై మహేష్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భీంగల్ కేసీఆర్ కాలనీకి చెందిన ఐదుగురు భీంగల్ నుండి సంతోష్ నగర్ తాండ సమీపంలో ఉన్న కేసీఆర్ కాలనీకి ఆటో టీ. ఎస్ 16 యుబి 8337 నెంబర్ గల ఆటోలో వెళ్తుండగా ఆటో డ్రైవర్ శేఖ్ సలీం ఆటోను వేగంగా, అజాగ్రత్తగా నడపడం మూలనా ఆటో కంట్రోల్ కాకా తాండ దాటిన తర్వాత బోల్తా పడింది. దాంతో ఆటోలో ఉన్న సయ్యద్ రియాన్ (9) తలకు తీవ్ర గాయం అయ్యి మృతి చెందాడు.మరో ప్రయాణికురాలు బేగం గారీ చేయికి గాయాలు అవ్వగా మిగితా వారికి చిన్న చితిక గాయాలు అయ్యాయి.మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Boy dies after auto overturns