Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2025, 2:01 pm Posted by : ramakrishna

వెన్నుపోటు దినం నిరసనలో కుప్పకూలిన బోత్స

విజయనగరం, బతుకమ్మ : వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన నిరసనలో వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన డీహైడ్రేషన్ కాస్త జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కాసేపు విరామం తర్వాత బొత్స సత్యనారాయణ తేరుకున్నారు. బీపీ షుగర్ కాస్త నియంత్రణలోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు.