చోరీ కేసులో ఇద్దరి రిమాండ్
ఎల్లారెడ్డి, బతుకమ్మ: చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఆబేద్ హుస్సేన్ ఈనెల 19న తన బంధువుల ఇంటికి హైదరాబాద్ వెళ్లాడు. 20న తన ఏటీఎం నుండి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు డ్రా చేసినట్లుగా అతనికి మెసేజ్ వచ్చింది. దీంతో ఎల్లారెడ్డి లోని తన ఇంటికి వచ్చి చూడగా ఇంటికి గల తలుపులు పగలగొట్టి ఇంట్లోని బీరువాలోని వస్తువులు చిందరవందరగా...