Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 6:47 pm Posted by : ramakrishna

సింగారం గ్రామం లో బోరుబావి త్రవ్వకం ప్రారంభం

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో ప్రజలకు నీటి సౌకర్యానికి అవసరమయిన బోర్ వేల్ ను శుక్రవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రారంభించారు.కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎం పి  బండి సంజయ్ కుమార్ ఎం పి లాడ్స్ నిధులను మంజూరు చేయగా అట్టి నిధులతో  సింగారం గ్రామంలో  బోర్ వేల్ త్రవ్వకాలను బీజేపీ నాయకులు ప్రారంభించారు. గ్రామంలో ప్రజలకు నీటి ఇబ్బందులను తొలగించుటకు బోర్ వెల్ త్రవ్వకాలకు నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరిన వెంటనే  కేంద్ర మంత్రి బండిసంజయ్ కుమార్ బోర్ వేల్ కు నిధులు మంజూరు చేశారని అందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ బండిసంజయ్  కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ అధ్యక్షులు రేపాక రామ చంద్రారెడ్డి,స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్  పొన్నాల తిరుపతిరెడ్డి ,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి,జిల్లా కార్యదర్శి బందారపు లక్ష్మారెడ్డి, ముస్తాబాద్ మండల అధ్యక్షులు సౌల క్రాంతి కుమార్ , మండల ప్రధాన కార్యదర్శులు  దాసరి గణేష్, నంది నరేష్, గ్రామ మాజీ సర్పంచ్ మంగోలి నరసయ్య,  శ్రీనివాస్ గౌడ్, వంతడుపుల సుధాకర్, తిరుపతి, బాలాగౌడ్, ఉడుగుల యాదగిరి, ప్రదీప్ రెడ్డి, కుమార్ ,వంగల రాజు, దయాకర్, దిలీప్, సిరిసిల్ల వంశీచరణ్ గౌడ్, తిరుపతి, బిజెపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.