Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 7:10 pm Posted by : ramakrishna

జడ్పీ నిధులతో బోరు బావి తవ్వకాలు

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జడ్పీ నిధుల ద్వారా మంజూరైన మూడు బోరు బావి తవ్వకాలను బుధవారం ప్రారంభించినట్లు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హామీద్. ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కేకే మహేందర్ రెడ్డి  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సీతారాం బజార్, బ్రాహ్మణ వీధి, హనుమాన్ నగర్ లో నాలుగు లక్షల 50 వేల రూపాయలతో మూడు బోర్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో మూడు కాలనీలలో నీటి ఎద్దడి తీరుతుందని కాలనీవాసులు అన్నారు. జిల్లా కలెక్టర్, కేకే మహేందర్ రెడ్డి కి వారు కృతజ్ఞతలు తెలిపారు.