ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:కేంద్ర హోమ్ శాఖ మంత్రి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంజూరు చేసిన ఎం పి లాడ్స్ నిధులతో ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో బోర్ బావి త్రవ్వకాన్ని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రామచంద్రం ప్రారంభించారు. పోతిరెడ్డిపల్లె గ్రామస్తులు అడిగిన వెంటనే బోరు వెల్ కు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ బండి సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మండల బిజెపి ప్రధాన కార్యదర్శిలు దాసరి గణేష్,నంది నరేష్ ,ఉపాధ్యక్షుడు మల్లారపు మహేష్ ,మెడిశెట్టి బాలయ్య, కిషన్ , బాలకృష్ణ గౌడ్, చరణ్ గౌడ్ ,తిరుపతి,వెంకయ్య, రాగురాములు,కిషోర్,మల్లయ్య, శ్రీనివాస్, వినోద్ ,సంతోష్,ప్రభాకర్, రవి, బాలు,సతీష్,వెంకటేష్ , లింగయ్య కార్యకర్తలు ,గ్రామస్తులు పాల్గొన్నారు.
