. . . నందిపేట్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్
నందిపేట్, బతుకమ్మ :
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఆర్మూర్ లో నిర్వహిస్తున్న ఆర్మూర్ నియోజక వర్గ బూత్ ఇన్ చార్జిల సమావేశాన్ని విజయవంతం చేయాలని నందిపేట్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం పది బూత్ కమిటీల ఇన్ చార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి బూత్ నుంచి పది మంది కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలని తీర్మానించారు. అలాగే ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.