నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వాసి ప్రజాకవి, ప్రముఖ రచయిత, అమరుడు డాక్టర్ ముత్యం రాసిన “నేను చిందులు ఎల్లమ్మ” అనే పుస్తకాన్ని తన కూతురు అయిన ప్రత్యూష యామిని ఆంగ్లంలో అనువదించారు. ఈ పుస్తకాన్నిహైదరాబాద్ లోని రవీంద్రభారతి మినీ హాల్లో శనివారం చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య సూర్య ధనుంజయ ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ డాక్టర్ ముత్యం తెలుగు సాహిత్యం పట్ల, ప్రజల పట్ల, అమితమైన ప్రేమ కలిగిన వారని అన్నారు.

జానపద కళలను కాపాడుకోవాలని, అందులో చిందుల దృశ్యాన్ని, చిందుల ఎల్లమ్మ జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చారని తెలిపారు. గ్రామీణ కళలను నిలబెట్టిన మహా వ్యక్తిగా ముత్యం కృషిని కొనియాడారు. ఆయన ఆలోచనల కొనసాగింపుగా తన కూతురు ప్రత్యూష యామిని తెలుగులో ఉన్న “నేను చిందులు ఎల్లమ్మ” అనే పుస్తకాన్ని ఆంగ్లానువాదం చేశారని పేర్కొన్నారు. మనమందరం ప్రత్యూష యామినిని అభినందించాలని కోరారు. ఈ సభలో ఎమ్మెల్సీ కోదండరాం, రాజేందర్, ప్రముఖ కవి నాల్లేశ్వర శంకర్, పులికొండ సుబ్బాచారి, తుర్లపాటి లక్ష్మీ, శంకర్ రు, వేల్పురు భూమయ్యరు, స్వయం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
