- భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విట్టల్ రెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వం ప్రకటించిన హామి ప్రకారం సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటల్ కు 500 రూపాయల బోనస్ వెంటనే విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విట్టల్ రెడ్డి అన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సాంగ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విట్టల్ రెడ్డి మాట్లాడారు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారమైనప్పటికీ రైతులకు యూరియా లేనందున వెంటనే సరిపడా యూరియా సప్లై చేయాలన్నారు. వ్యవసాయ రుణమాఫీ రైతులందరికీ సౌలభ్యం అవుతుందని ఆశించిన అనేకమంది రైతులకు నిరాశ మిగిలిందని అన్నారు. అర్హులైన రైతులకు వెంటనే రుణమాఫీ పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని తెలిపారు. ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని రైతులకు యూరియాను అందుబాటులో ఉంచుతామని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి రెడ్డి, శంకర్ రావు, సాహెబ్ రావు, భైరవరెడ్డి, చిన్న అంజన్న, భాస్కర్, వెంకట్ యాదవ్, రామ్ రెడ్డి, సుద్దాల లింగం, మనోజ్ రెడ్డి పాల్గొన్నారు.