Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2024, 3:43 pm Posted by : ramakrishna

అమ్మవారికి బోనాలు

బతుకమ్మ, మోర్తాడ్:  దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మోర్తాడ్ మండలం శెట్ పల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దేవీ మండపంలో బోనాలు సమర్పించారు. ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో బోనాలను ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో ముదిరాజ్ యువసేన సభ్యులు బొమ్మ శ్రీనివాస్, అరవింద్, రాజేందర్, ప్రవీణ్, నాగాచరణ్, ప్రశాంత్, శరత్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.

Bonuses for mom