రైతులకు బోనస్ జమ

బాల్కొండ, బతుకమ్మ: కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం రూ.500 చొప్పున బోనస్ జమ చేస్తోందని, ఇప్పటి వరకు జిల్లాలో 10వేల మంది రైతుల ఖాతాల్లో బోనస్ జమైందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బాల్కొండలో కోళ్లఫారం, కిసాన్ నగర్ లో గేదెల షెడ్డు నిర్మాణానికి మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. రాష్ర్ట ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని, సంవత్సర కాలంలో 52వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఏపీవో చంద్రిక...