Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 1:38 pm Posted by : ramakrishna

రైతులకు బోనస్ జమ

బాల్కొండ, బతుకమ్మ: కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం రూ.500 చొప్పున బోనస్ జమ చేస్తోందని, ఇప్పటి వరకు జిల్లాలో 10వేల మంది రైతుల ఖాతాల్లో బోనస్ జమైందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బాల్కొండలో కోళ్లఫారం, కిసాన్ నగర్ లో గేదెల షెడ్డు నిర్మాణానికి మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. రాష్ర్ట ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని, సంవత్సర కాలంలో 52వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఏపీవో చంద్రిక ,ఈవో రజనీకాంత్ రెడ్డి, ముప్కాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యంరెడ్డి, వేంపల్లి పీఏసీఎస్ చైర్మన్ జక్క రాజేశ్వర్, డైరెక్టర్లు ఇమ్రాన్, నరసన్న, ఆకుల సౌజన్య, కొత్తపల్లి రవి ,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిట్యాల శ్రీనివాస్, జిల్లా మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీ, నగర అధ్యక్షులు సంజీవ్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, మాజీ సర్పంచ్ తౌడ్ గంగాధర్, విద్యాసాగర్, రియాజ్, కుమ్మరి గంగాధర్, నవీన్, సంతోష్ గౌడ్, అరవింద్, బిట్టు, తేజ, రాజేష్, కృష్ణా, మల్లేష్, సగర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Bonus deposit for farmers