Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 7:41 pm Posted by : ramakrishna

ఘనంగా గ్రామ దేవతలకు బోనాలు

బతుకమ్మ, నాగిరెడ్డిపేట : మండలంలోని తాండూర్ గ్రామంలో ఆదివారం గ్రామ దేవతలకు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించారు. గ్రామంలోని దుర్గామాత, రేణుక ఎల్లమ్మ, ఊరడమ్మ, నల్ల పోచమ్మ ఆలయాలలో గ్రామ మహిళలు అమ్మవార్లకు బోనాల ప్రదక్షిణ నిర్వహించి, నైవేద్యం సమర్పించి, పాడి పంటలతో, పిల్లాపాపలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.