Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 7:44 pm Posted by : ramakrishna

పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి

  • మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్

భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ కోరారు. ఆదివారం పట్టణంలోని రెండో వార్డ్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్బంగా కాలనీ లో మురికి కాలువలను శుభ్రం చేసి, కాలువల్లో నుండి తీసిన చెత్త ను ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించారు. మార్చి 1 నుండి పట్టణం లో అన్ని వార్డ్ లలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను 18 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ సిబ్బంది ఎంత చేసినప్పటికి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పనిలో ప్రజలు కూడ భాగస్వామ్యములు కావాలని అన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, ఇంట్లో పోగు చేసిన చెత్తను మున్సిపల్ చెత్త తీసుకెళ్లే వాహనాల్లోనే వేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రజలు, మున్సిపల్ భాగస్వామ్యంతో పట్టణం సుందరీకరణ దిశగా పయనించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇంచార్జి ఇన్స్పెక్టర్ సున్నపు ఓంకార్, వార్డ్ అధికారి కొత్వల నవీన్, వర్క్ ఇన్స్పెక్టర్ పల్లికొండ శ్రీధర్, జవాన్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.