శట్పల్లి సంగారెడ్డిలో బోనమెత్తిన రజకులు
సీతాలాదేవి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం లింగంపెట్, బతుకమ్మ : రజకుల ఆరాధ్య దైవం సీతాల దేవి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని లింగంపేట్ మండలంలోని షట్పల్లి సంగారెడ్డిలో ఘనంగా రజక కులస్తులు నిర్వహించారు. షట్పల్లి సంగారెడ్డిలో మూడు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన శీతాల దేవి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం రజకులు ఇంటికో బోనం ఎత్తి వారి సాంప్రదాయాల ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శట్పల్లి సంగారెడ్డి రజక సంఘం...