Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2025, 7:08 pm Posted by : ramakrishna

శట్పల్లి సంగారెడ్డిలో బోనమెత్తిన రజకులు

  • సీతాలాదేవి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

లింగంపెట్, బతుకమ్మ : రజకుల ఆరాధ్య దైవం సీతాల దేవి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని లింగంపేట్ మండలంలోని షట్పల్లి సంగారెడ్డిలో ఘనంగా రజక కులస్తులు నిర్వహించారు. షట్పల్లి సంగారెడ్డిలో మూడు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన శీతాల దేవి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం రజకులు ఇంటికో బోనం ఎత్తి వారి సాంప్రదాయాల ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శట్పల్లి సంగారెడ్డి రజక సంఘం సభ్యులు, చాకాలి అజయ్ కుమార్, బాబు, సంతోష్, బిక్కండ్ల సుభాష్, బండల్ల యాదగిరి, సాయిలు, తదితరులు,పాల్గొన్నారు.

Bonamettina Rajakulu in Shatpalli Sangareddy