తాడ్వాయి లో గ్రామ దేవతలకు బోనాలు

  తాడ్వాయి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లోని కన్కల్, తాడ్వాయి, కృష్ణాజివాడి గ్రామాలలో గ్రామ దేవతలకు ఆదివారం బోనాలు సమర్పించారు. ఈ బోనాల పండుగను గ్రామస్తులు ప్రతి ఏటా ఎంతో వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆషాడ మాసంలో గ్రామస్తులంతా ఏకమై అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. పండగ రోజు మహిళలు కొత్త కుండలతో అన్నం, పాలు, బెల్లంతో బోనాలన్నీ వండి పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలంకరించి, తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారికి బోనాలతో...