బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామంలో మంగళవారం గ్రామదేవతలకు బోనాల పండుగ వి డి సి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని నల్ల పోచమ్మ,ముత్యాలమ్మ ఆలయంలో గ్రామ మహిళలు అమ్మవారికి బోనాల ప్రదక్షిణ నిర్వహించి నైవేద్యం సమర్పించి పాడిపంటలతో పిల్లాపాపలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు సిద్దు ,నాగభూషణం మాజీ సర్పంచ్ జనగామ శ్రీనివాస్, నాగరాజ్ వేణు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు స్వామి గ్రామ యువకులు ప్రజలు ఉన్నారు.