Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2025, 5:57 pm Posted by : ramakrishna

తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనం బోనాలు

మోర్తాడ్, బతుకమ్మ: తెలంగాణ బోనాలు సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని  గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య అన్నారు. మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాలను విద్యార్థులు ఎత్తుకొని పాటలతో, నృత్యాలతో శోభాయాత్ర కన్నుల పండుగ నిర్వహించారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులలో సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.