Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2025, 1:58 pm Posted by : ramakrishna

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాలు

– అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్,బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లో లక్ష్మి సిల్క్స్  ఆధ్వర్యంలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మ వారి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడారు. ఈ  సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, సమాజంలో సౌభాగ్యం, శాంతి, సమృద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామదేవతకు బోనాలు తీయడం ఆనవాయితీగా  వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢమాసంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రజలందరు బోనాలు సమర్పిస్తారన్నారు. అమ్మ దయతో సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని పిల్లపాప అన్నింటిని  కాపాడాలని మొక్కుకోవడం జరిగిందన్నారు.మహాలక్ష్మినగర్ వాసులు ఉత్సాహంగా, ఆనందంగా పండుగను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని, పాటలతో, కోలాటాలతో ప్రదర్శనలు ఇస్తూ సంబరాలను మరింత భక్తిమయంగా, శోభాయమానంగా మార్చారని అన్నారు. కార్యక్రమంలో  22వ డివిజన్ కార్పొరేటర్ పంచారెడ్డి లావణ్య & లింగం, లక్ష్మి సిల్క్స్ షాపింగ్ మాల్ అధినేత శీతల్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మినారాయణ,పార్షి రాజు, అల్లాడి రాజు, భోగ గంగాధర్, ఆనంద్,శివునూరి భాస్కర్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Bonalu is a symbol of Telangana culture and traditions.