తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాలు
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అహ్మద్ పూర కాలనీ గంగా పుత్ర మరాఠి బోయి సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబబాయి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో సౌభాగ్యం, శాంతి, సమృద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామదేవతకు బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశడమాసంలో ప్రజలందరు భక్తి శ్రద్దలతో...