గూపన్ పల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మకు బోనాలు

  నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని 3వ డివిజన్ గూపన్ పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించిన బోనాలను తలపై ఎత్తుకుని ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శివసత్తులు పూనకంతో భక్తులను ఆకట్టుకోగా, డప్పు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, సంప్రదాయ కళారూపాలు గ్రామంలో...