అంగరంగ వైభవంగా బోనాల పండుగ…
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని గ్రామ వతందర్ వెంకటేశ్వర దేశాయ్ ఇంటి నుండి పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి బోనాలను డప్పువాయిద్యాలు డీజే చెప్పుల్ల మధ్య పోతురాజుల నృత్యాలతో ఘనంగా ఊరేగింపుగా అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పచ్చగ ఉండాలని డాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని...