రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని గ్రామ వతందర్ వెంకటేశ్వర దేశాయ్ ఇంటి నుండి పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి బోనాలను డప్పువాయిద్యాలు డీజే చెప్పుల్ల మధ్య పోతురాజుల నృత్యాలతో ఘనంగా ఊరేగింపుగా అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పచ్చగ ఉండాలని డాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వతందార్ వెంకటేశ్వర దేశాయ్, గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్,బచ్చు రామ్ సెట్, బద్దం సంజీవ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, పత్తి లక్ష్మణ్, కటికే రామ్ రాజ్, బొట్టే గజేందర్, డౌర్ సాయిలు, స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
