Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 6:15 pm Posted by : ramakrishna

టీజీవో ఆధ్వర్యంలో ఘనంగా బోనాల  పండుగ

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ లోని వనదుర్గాదేవి ఆలయంలో టీజీవో ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై బోనంను ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టీజీవో ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో బోనాల కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగోళ్ళ లక్ష్మీనారాయణ, శశాంక్ రెడ్డి, టీజీవో ఎంప్లాయిస్ అధ్యక్షులు అలుక కిషన్, అమృత్  కుమార్, చిట్టి నారాయణ, ఆకుల ప్రసాద్, దాస్, సత్యం, పెద్దోళ్ళ నాగరాజు, చందు పాల్గొన్నారు.

 

Bonalu festival celebrated grandly under the aegis of TGO.