Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 5:36 pm Posted by : ramakrishna

బొప్పాపూర్ లో ఘనంగా బోనాల పండుగ…

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో గ్రామస్తులు మంగళవారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు బోనాలు ఎత్తుకొని పోచమ్మ ఆలయం నుండి బారేడు పోచమ్మ ఆలయం వరకు డప్పు చప్పులతో, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపుగా తరలి వెళ్లారు. అమ్మవారికి నైవేద్యాలు బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, గ్రామస్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పట్ల సురేష్, పట్ల సంతోష్, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పట్ల శ్రీకాంత్, నాయకులు కొత్తపల్లి రవి కిరణ్, సిరిగిరి శేఖర్, మహిళలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.