ఆర్కిడ్స్ హై స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

  బిచ్కుంద, బతుకమ్మ :   తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఆర్కిడ్స్ హై స్కూల్ ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ స్ఫూర్తిని చిన్నారుల్లో పెంపొందించే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం పండుగ వేడుకలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ గోపి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. పాఠశాల ప్రాంగణాన్ని మల్లెపూల దండలు, వేపాకులు,...