Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:19 pm Posted by : ramakrishna

సరస్వతీ శిశుమందిర్‌లో ఘనంగా బోనాల వేడుకలు

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండల కేంద్రంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో బోనాల కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోతరాజు వేషాలు వేయించి, బోనాలతో వీధుల్లో ఊరేగించారు. డోలు చప్పుళ్లు, పాటలతో వాతావరణం భక్తిమయంగా మారింది. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని ఆకట్టుకున్నారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ చిన్నారుల్లో సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పురం రాజమౌళి, కొడిప్యాక వెంకటేశం, గొల్ల రమేష్, సందుగారి రవీందర్ రెడ్డి, వెంకట నరసింహులు, బత్తుల రాజు ఉన్నారు.

 

Bonalu celebrations held on a grand scale at Saraswati Shishu Mandir.