మర్కల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఆషాఢ మాస బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం బోనాలను అందంగా అలంకరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని కట్ట మైసమ్మ ఆలయానికి చేరుకుని బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంగెం శ్రీనివాస్, ఉపాధ్యాయులు కార్తీక్, సౌమ్య, అఖిల, రమ్య, విమల,...