ఫ్యూచర్ లైన్ పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఫ్యూచర్ లైన్ పాఠశాలలో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతిలో దాని ప్రాముఖ్యత, పండుగకు సంబంధించిన సంప్రదాయాలు, ఆచారాల గురించి విద్యార్థులకు వివరించారు. భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడం, విద్యార్థుల్లో సాంస్కృతిక విలువల పట్ల అవగాహన పెంపొందించడమే...