ఘనంగా బోనాల పండుగ
భీమ్ గల్, బతుకమ్మ : ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఆదివారం నిర్వహించుకొనే గ్రామ దేవతల బోనాల పండగను మెండోరా గ్రామంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆనందోత్సవాల మధ్య ప్రజలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మెండోరా గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు గ్రామాలకు నలువైపులా కొలువై ఉన్న గ్రామదేవతలకు బోనాలు సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించి బలి ప్రదానం చేశారు.ఇందులో భాగంగా గ్రామదేవతలైన పెద్దపోచమ్మ, పెద్దమ్మ తల్లి, ఐదు చేతుల పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవారు, తాత ఆయి అమ్మవారు, నల్ల పోచమ్మ...