Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 12:42 pm Posted by : ramakrishna

ఘనంగా బోనాల పండుగ

భీమ్ గల్, బతుకమ్మ :  ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఆదివారం నిర్వహించుకొనే గ్రామ దేవతల బోనాల పండగను  మెండోరా గ్రామంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆనందోత్సవాల మధ్య ప్రజలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మెండోరా గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు గ్రామాలకు నలువైపులా కొలువై ఉన్న గ్రామదేవతలకు బోనాలు సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించి బలి ప్రదానం చేశారు.ఇందులో భాగంగా గ్రామదేవతలైన పెద్దపోచమ్మ, పెద్దమ్మ తల్లి, ఐదు చేతుల పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవారు,  తాత ఆయి అమ్మవారు, నల్ల పోచమ్మ తల్లి, మత్తడి పోచమ్మ, ముత్యాలమ్మ  గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు.  నైవేద్యంగా మేకలు, కోళ్ళు, గోర్లలను బలి ఇచ్చారు.  గ్రామాల్లో పాడి,పంటలు బాగా  పండాలని, మనుషులకు, జంతువులకు అంటువ్యాధులు ప్రబలకుండా, అరాచకాలు జరగకుండా చూడాలని ప్రార్థిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.  ఈ బోనాల పండగ గ్రామ కమిటీ పెద్దలు, కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో జరిగింది.  గ్రామాల్లోని ప్రజలు కుటుంబ సమేతంగా వనభోజనాలలోవెళ్లి ప్రకృతి దేవత ఒడిలో సహా పంక్తి భోజనాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మెండోరా  గ్రామకమిటీ అధ్యక్షులు గౌరురాజన్న, ఉపాధ్యక్షులు గుడిసె సాయిబాబా, కోశాధికారి గంగారెడ్డి, డిసిసి కార్యదర్శి కుంట రమేష్, ఐకేపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగారెడ్డి
వివిధ కుల సంఘాల పెద్ద మనుషుల, ప్రజలు పాల్గొన్నారు.