విజ్ఞాన్ లో ఘనంగా బోనాల పండుగ

ముప్కాల్, బతుకమ్మ : తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా శనివారం ముప్కాల్ మండలంలోని రేంజర్ల గ్రామంలో గల విజ్ఞాన్ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తీరోక్క వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించుకొని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. పోతరాజుల విన్యాసాలతో బోనాల కుండలతో విద్యార్థులు బోనాల పండుగలు కండ్లకు కట్టినట్టుగా చూపించారు. కరస్పాండెంట్ సోహెల్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.