రుద్రూర్ లో ఘనంగా బోనాల పండుగ
బోనాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం రుద్రూర్, బతుకమ్మ: ఆషాడ మాస బోనాలను పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అంబం(ఆర్), చిక్కడపల్లి గ్రామాలలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ గ్రామంలో వతాందర్ వీఆర్ దేశాయి ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల పండుగలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు పాల్గొని బోనం ఎత్తుకున్నారు. భాజా భజంత్రీలతో, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపుగా అన్ని...