ఘనంగా బోనాల పండగ
బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవతల ఆలయాల ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన అనంతరం శనివారం గ్రామ దేవతలమెంటుకి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు ప్రతి కుటుంబం నుండి ఒకరు బోనమెత్తి భాజా భజంత్రీలతో, మంగళ హారతులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులందరూ చెరువు కట్ట వద్ద గంగమ్మ ఆలయానికి అభిషేకము, హారతి తోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు....