Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2025, 6:12 pm Posted by : ramakrishna

ఘనంగా బోనాల పండగ

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవతల ఆలయాల ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన అనంతరం శనివారం గ్రామ దేవతలమెంటుకి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు ప్రతి కుటుంబం నుండి ఒకరు బోనమెత్తి భాజా భజంత్రీలతో, మంగళ హారతులతో ఊరేగింపుగా వచ్చి  అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులందరూ చెరువు కట్ట వద్ద గంగమ్మ ఆలయానికి అభిషేకము, హారతి తోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  భక్తులకు మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూజారి శివ శాస్త్రి మాట్లాడుతూ… గ్రామ చావిడి వద్దనుండి మహిళలు,  పురుషులు పెద్ద ఎత్తున ప్రతి ఆలయానికి వెళ్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించి బోనాలు సమర్పించినట్లు చెప్పారు. అనంతరం గంగమ్మ గుడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. డీజే పాటలకు ఆడపడుచులందరూ చేసిన ముత్యాలు ఆకట్టుకున్న ఆయన చెప్పారు. గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ దేవతల పండుగ సందర్భంగా నేడు గంగమ్మ జాతర, గ్రామ దేవతలకు బోనాలు సమర్పించినట్టు చెప్పారు. గ్రామదేవతలను కొలిచినప్పుడే గ్రామం సుభిక్షంగా ఉంటుందని, పంటలు సంవృద్ధిగా పండుతాయని చెప్పారు. గ్రామస్తులంతా కలిసి ఇలాగే వీలైనప్పుడల్లా గ్రామదేవతల పండుగ చేయాలని సూచించారు. రామదేవతలు గ్రామస్తులను చల్లగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పుల్కంటి కిష్టయ్య, గడ్డం కృష్ణకుమార్, మేత్రి సాయిలు, సంగెం లక్ష్మణ్, టాక్లి లాలయ్య, గడ్డం లాలు, ముత్తయ్య, మహేష్ గౌడ్, దొడ్ల కిష్టయ్య, శ్రీధర్, కాశీరామ్, ప్రశాంత్,బరిశెట్టి ఆంజనేయులు, బోధన్ సాయిలు,బోధన్ హన్మంతు, పుల్కాంటి వీరేందర్,భూమేష్, సాయిబాబు, బోధన్ ఆనంద్,బోధన్ శ్యామ్, బరిశెట్టి సాయిలు,బరిశెట్టి శ్రీనివాస్, బోధన్ లక్ష్మణ్, సంగెం శ్రీకాంత్, గడ్డం శ్రీనివాస్, చంద్రశేఖర్ గౌడ్,మహిళలు, భక్తులు పాల్గొన్నారు.