ఘనంగా బోనాల పండగ
భీమ్ గల్, బతుకమ్మ : పాడి,పంట, గొడ్డు, గోదా బాగుండాలని, అంటువ్యాధులు దరిచేరకూడదని వేడుకొంటూ మండలంలోని మెండోరా గ్రామంతో పాటుమండలంలోని అన్ని గ్రామాల్లోఘనంగా బోనాల పండగ ను జరుపుకొన్నారు. ప్రతి యేటా ఆషాడ మాసంలో ఆదివారం నిర్వహించుకొనే ఈ గ్రామ దేవతల బోనాల పండగను ఆనందోత్సవాల మధ్య జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మెండోరా గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు గ్రామాలకు నలువైపుల కొలువై ఉన్న గ్రామదేవతలకు బోనాలు సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించి బలి ప్రధానం చేశారు.ఇందులో భాగంగా గ్రామదేవతలైన పెద్దపోచమ్మ, పెద్దమ్మ...