చంద్రనగర్‌లో ఘనంగా బోనాల పండగ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలోని డివిజన్ నంబర్ 7 చంద్రనగర్ ప్రాంతంలోని శ్రీశ్రీశ్రీ పుట్ట మైసమ్మ దేవాలయంలో ఆదివారం బోనాల పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ ఆలయానికి చేరుకుని పుట్ట మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. బోనాల పండగ భక్తి భావంతో, సామూహిక...