బోధన్ లో ఘనంగా బోనాల పండుగ
బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం మున్నూరు కాపు, ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. తెలుగు సంప్రదాయ సంస్కృతుల పరంపరను ప్రతిబింబించేలా, ఈ పండుగ గ్రామీణ జీవనశైలిలోని ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఉత్సవంలో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో అలంకరించుకొని, శోభాయమానమైన బోనాలతో తమ నివాసాల నుంచి ఊరేగింపుగా బయలుదేరి డప్పు వాయిద్యాల మధ్య మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల సంఘ...